పుస్తక పరిచయం : ద్రౌపది

రచయిత : ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
వెల : నూట ఇరువది రూపాయలు
ఈ పుస్తకము రచయిత కి దూషణ, భూషణ తిరస్కరాదుల్ని, ప్రసంసలని సంపాదించి పెట్టింది. సాహిత్య అకాడెమి పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది.

ఈ పుస్తకము మహాభారతము లోని ద్రౌపది పాత్ర చుట్టూ జరిగిన కథ. ఈ కథ లో కొన్ని వ్యాస భారతము లోని అంశాలు, కొన్ని వివిధ పుస్తకాల నుంచి తీసుకొన్నవి, కొన్ని రచయిత కల్పించుకొన్నవి కలిపి చెప్పారు. ద్రౌపదికి ఐయుదుగురు భర్తలు ఈ జన్మలో ఎందుకున్నారు? రచయిత చెప్పిన ప్రకారము ఆమె గత రెండు జన్మలలో కూడా కామేచ్చ తీరని స్త్రీ. దీనికి మూలము సంస్కృత భారతములోను, నన్నయ భారతములోను కూడా ఉన్నది. ఇంద్రసేన అనే పేరుతొ మౌద్గల్య మహర్షి భార్యగా గత జన్మ వృత్తాంతము ఇవ్వబడినది. మేరీ జన్మ లో కసి రాజు కుమార్తెగా జన్మించి వివాహము కానందున శివుని గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షము అయినప్పుడు ఆమె అయిదు సార్లు భర్త ని ప్రసాదించమని తొందరలో అయిదు సార్లు అదిగినదట, శివుడు మెచ్చి అటులనే నీకు తరువాతి జన్మలో అయిదుగురు భర్తలు ఉంటారని వరమిచ్చినందున ఈ జన్మలో పాండవులకి భార్యగా పుట్టి తన కోరికలను తీర్చుకున్నది. ఇది కూడా మహాభారతములో చెప్పబడినది.

ద్రౌపది మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆమె సౌసీల్యాన్ని, కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, శ్రీకృష్ణుని సఖిగా, మహారాజ్నిగా, రాజనీతిజ్నురాలిగా, ఉత్తమ ఇల్లాలుగా, గృహిణిగ వివరించడమే తన ఉద్దేశ్యమని రచయిత అన్నారు. కాని, దాని కంటే ద్రౌపది తన అయిదుగురు భర్తలతో ఎలా కామేచ్చ తీర్చుకొన్నది చాల వివరముగా, అశ్లీల అంచుల దాక వివరించారు.

అసలు మహాభారత యుద్ధానికి కర్ణుడు, ద్రౌపదియే కారణమని వివరించారు. కుంతీదేవి చాలముందు గానే కర్ణుడు తన కొడుకు అని చెప్పిన యుధము జరిగేది కాదని రాసారు. ద్రౌపది పుట్టుక నించి మరణము దాక , సవివరముగా రాసారు. ద్రౌపది కోపాన్ని, తనకు అవమానము,నష్టము జరిగితే ఎలా పాండవుల ద్వార కౌరవుల మీద, అశ్వద్ధామ మీద, సైంధవుని మీద పగ తీర్చుకున్నదో చెప్పారు.

ఈ పుస్తకాన్ని ఎందరు ప్రసంసించారో అంతకన్నా ఎక్కువ మంది దూషించారు. అందువలననే ఇప్పటికి అయిదు ముద్రణలు జరిగాయి. పుస్తకాన్ని అలా విమర్శలు ద్వార బాగా మార్కెటింగ్ చేసారు.

కాని ఎలా ఉన్నా ఇది కొని తప్పక చదవవలసిన పుస్తకము.

Comments