శోభన్ బాబు జీవిత చరిత్ర

రచయిత : ఆకెళ్ళ రాఘవేంద్ర రావు
వెల : ౨౦౦ రూపాయలు

శోభన్ బాబు గారు మన అందరికి ఒక సినిమా నాయకుడు గానే తెలుసు. కాని అతను ఒక మహోన్నత వ్యక్తిత్వం గల మనిషి. నియమ నిబన్దలతొ జీవితాన్ని గడిపిన వ్యక్తి. ఎ పనిఅయిన ఎక్కడ మొదలు పెట్టాలో విజయం సాధించడానికి ఏమి చెయ్యాలో మన అందరికి తెలుసు. కాని ఎక్కడ ఆపితే ఆ విజయాన్ని ఆస్వాదించగలమో ఎంత మందికి తెలుసు . నిజానికి అది తెలియడమే విజయ రహస్యము . అది తెలిసిన వ్యక్తి శోభన్ బాబు గారు.

మనిషి అనేవాడు ఎలా ఉండాలి. తన తోటి మనిషి తో ఎలా ప్రవిర్తంచాలి నటుడు అనేవాడు
ఎలా ఉండాలి నడుకి సెట్ లో ఉన్న పరిమితులేమిటి ఒక నటుడు తోటి నటులతో ఎలా మెలగాలి, నిర్మాతను ఎలా మర్యాద ఇవ్వాలి దర్శకుల నుంచి లైట్ బాయ్ వరకు ఎలా పలకరించాలి అని తెలిసిన వ్యక్తీ శోభన్ బాబు గారు.

అతను చాల కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు విలువ తెలిసిన వ్యక్తి. డబ్బుని వృధాగా ఖర్చు చేయడము ఇష్టము లేని వ్యక్తి. అతనిలో ఒక పెద్ద ఆర్ధిక వెతను చూడవచు. ఈ పుస్తకములో అతను ఎన్ని సినిమాలలో నటించాడు ఎన్ని సత దినోత్సవాలు జరిగాయి ఎన్ని బాగా ఆడాయి అనే పట్టిక లేదు. కాని అతని వ్యక్తిత్వము గురించి ఉన్నది.

శోభన్ బాబు గారు నటనని ఒక వృతి గానే భావించారు. ఆదివారము పూర్తిగా సంసారినికి
కేటాయించారు. ఆదివారం షూటింగ్ లకు వెళ్ళరు. భూమిని నమ్ముకొన్న వ్యక్తి. మొదటినించి తన సంపాదన లో కొంత డబ్బు పెట్టి భూమిని కొన్నారు. అందరికి అదే సలహా ఇచ్హారు. ఆ సలహా విని ఎందఱో కోటీశ్వరులు అయ్యారు. సినిమాలు తీసి ఎందఱో నష్ట పొయ్యారని సినిమాలు తీయలేదు. పిసినారి అని అందరు అంటారు కాని డబ్బు విలువ తెల్సిన మనిషి అని అంటారు.

శోభన్ బాబు పుస్తకము ప్రతి ఒక్కరికి మార్గ దర్సకము కావాలి. మనిష వ్రుత్తి జీవితాన్ని విరమించే సమయానికి ఆర్ధిక భద్రతా అవసరము. రిటైర్ అయ్యాక కూడా హాయిగా బ్రతకాలి అంటే డబ్బు కావాలి. అందుకనే అయన స్తలాలు కొన్నారు. వ్యాపారము రాదు కాబట్టి ఆయనే ఆ స్తలాలలో బిల్డింగ్స్ కట్టి పెద్ద కర్పోరాటే ఆఫీసుస్ కి అద్దేకిచారు. అందరికి అందగాడు గానే గుర్తుండాలి అని అరవయి ఏళ్ళకే సినిమా లు మానుకొన్నారు. అతని జీవన విధానము ఒక పెర్సానాలిటి దేవేలోప్మేంట్ పుస్తకము.

అందరు కొని చదవవలసిన పుస్తకము ఇది.

Comments

 1. ఈ పుస్తకం మొత్తంలో శోభన్ బాబు గారి కుటుంబసభ్యుల ఫొటో ఒక్కటి కుడా లేదు.ఎందుకో మరి?నెట్ లో ఎక్కడైనా అది దొరుకుతుందా?

  ReplyDelete
 2. Hi naku shoban babu gari book kavali ekkada dorukuthundi

  ReplyDelete
 3. where i have to get history of Shoban babu hero
  i need much
  kindly do it favour

  ReplyDelete

Post a Comment